నాగ్‌పూర్ జైలు నుంచి విడుదలైన ప్రొఫెసర్ సాయిబాబా

మావోయిస్టులతో సంబంధం ఉందన్న కేసులో శిక్ష అనుభవిస్తున్న ప్రొఫెసర్ సాయిబాబాను బాంబే హైకోర్టు విడుదల చేయాలని రెండు రోజుల క్రితం తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు ప్రొఫెసర్ సాయిబాబాని ఈరోజు (మార్చి7)న నాగ్ పూర్ జైలు నుంచి విడుదల చేశారు. నక్సలైట్లతో చేతులు కలిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని 2014లో మహారాష్ట్ర పోలీసులు ఆయనని అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు మరో ఆరుగురికి 2017లో గడ్చిరోలి సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. అప్పటి నుంచి వీల్ ఛైర్ కి పరిమితమైన సాయిబాబా జైలులోనే శిక్షను అనుభవిస్తున్నారు. సుప్రీం కోర్టు ఆదేశంతో నాగ్ పూర్ హైకోర్టు ఈకేసును విచారించి సాయిబాబా నిర్థోషి అని తేల్చి చెప్పింది. ఆయన్ని వెంటనే విడుదల చేయాలని మార్చి 5న తీర్పు ఇచ్చింది. జైల్లో ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. 

ALSO READ :-Ajith Kumar: హాస్పిటల్లో చేరిన స్టార్ హీరో..ఆందోళనలో ఫ్యాన్స్..!