కులగణనపై బీఆర్ఎస్ వ్యతిరేక ప్రచారం

కులగణనపై బీఆర్ఎస్ వ్యతిరేక ప్రచారం
  • సమాజ్ వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ సింహాద్రి

ముషీరాబాద్, వెలుగు: ప్రజాస్వామ్యం, అభివృద్ధికి ఎంతో కీలకమైన కులగణనకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ప్రచారం చేస్తోందని సమాజ్ వాదీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ సింహాద్రి ఆరోపించారు.

తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టి తెలంగాణను బలోపేతం చేద్దామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో కులగణన అత్యంత కీలకమైన నిర్ణయమని ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. ప్రజలు కుల సర్వేకు సహకరిస్తూ భాగస్వామ్యం పంచుకోవాలన్నారు.