
- సమాజ్ వాది పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ సింహాద్రి
అంబర్పేట, వెలుగు: ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాజకీయాలకు మలుపుగా పరిగణించాలని సమాజ్ వాది పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ సింహాద్రి చెప్పారు. రాజకీయంగా వెనుకబడిన సామాజిక వర్గాలకు అధికారం అనే నిదాదంపై తీవ్ర చర్చ జరిగిందన్నారు. మొదటిసారి సామాజిక ఎజెండా అంశంతో ఎన్నికలు జరిగాయన్నారు. గురువారం సిటీలోని శివం రోడ్ లో నిర్వహించిన పార్టీ సమావేశంలో సింహాద్రి మాట్లాడారు.
రాజకీయాలను డబ్బు శాసిస్తున్న టైంలో బలహీన వర్గాలు మేము సైతం అంటూ ముందుకు రావడం శుభపరిణామన్నారు. అధికారం కొన్ని సామాజిక వర్గాల చేతిలో బందీ అవ్వడంతోనే రాష్ట్రం వెనుకబాటుతనానికి గురవుతోందన్నారు. సామాజిక మార్పును తెలంగాణ ప్రజలు దశాబ్దాలుగా కోరుకుంటున్నారని, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉన్నాయన్నారు. రానున్న రోజుల్లో సామాజిక అంశం బలంగా వినిపిస్తుందని తెలిపారు