పీయూ వీసీ బాధ్యతల స్వీకరణ

 పీయూ వీసీ బాధ్యతల స్వీకరణ

మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: పాలమూరు యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్  శ్రీనివాస్  సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ పీయూ వీసీ బాధ్యతలు చేపట్టడం గర్వకారణమని, ఈ అవకాశం కల్పించిన సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. వివిధ హోదాల్లో పని చేసిన అనుభవంతో యూనివర్సిటీని అన్నిరకాలుగా అభివృద్ధి చేస్తానని,యూనివర్సిటీకి వచ్చే పేద, మధ్యతరగతి విద్యార్థులకు సౌలతులు కల్పించేందుకు ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. 

నాణ్యమైన భోజనం, హాస్టల్లో సౌలతులు కల్పిస్తామని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి లా అండ్  ఇంజనీరింగ్  తరగతులు ప్రారంభిస్తామని చెప్పారు. విద్యార్థులకు కోర్స్  పూర్తయ్యాక ఉపాధి లభించేలా చర్యలు తీసుకుంటామని, చదువుతోపాటు సంస్కారాన్ని పెంపొందించే కొత్త కోర్సులకు రూపకల్పన చేస్తామని తెలిపారు. రిజిస్ట్రార్  మధుసూదన్ రెడ్డి, పరీక్షల నియంత్రణ అధికారి రాజ్​కుమార్, విజయలక్ష్మి,శాంతి ప్రియ, ఎన్ఎస్ఎస్  కో ఆర్డినేటర్  కె ప్రవీణ, పీజీ కాలేజీ ప్రిన్సిపాల్  చంద్ర కిరణ్, ఫార్మసీ కాలేజీ ప్రిన్సిపాల్  నూర్జహాన్  పాల్గొన్నారు.