ఇగ్నో ప్లానింగ్ బోర్డు మెంబర్​గా ప్రొఫెసర్ వెంకటరమణ

హైదరాబాద్, వెలుగు: ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) ప్లానింగ్ బోర్డు మెంబర్​గా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వీ.వెంకటరమణ నియమితులయ్యారు. ఆయన మూడేండ్ల పాటు ఈ బాధ్యతల్లో కొనసాగనున్నారు. ఇగ్నో వర్సిటీ కార్యక్రమాల రూపకల్పనలో కీలకమైన నిర్ణయాల్లో ఆయన భాగస్వాములు కానున్నారు. కాగా, వెంకటరమణ గతంతో తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ వైస్ చైర్మన్​ గా, ఆర్జీయూకేటీ ఇన్ చార్జ్ వీసీగా, హెచ్ సీయూలో స్కూల్ ఆఫ్ మేనేజ్‌‌‌‌మెంట్ స్టడీస్ డీన్​గా విధులు నిర్వహించారు.