- సెమినార్లో పలువురు వక్తలు
ఓయూ, వెలుగు: ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా ప్రజలు గర్వించ దగ్గ ప్రపంచ మేధావి అని పలువురు వక్తలు కొనియాడారు. ‘ప్రొఫెసర్ సాయిబాబా జీవితం -చర్చ’ అనే అంశంపై ఓయూ సెమినార్ హాల్లో సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడారు. సాయిబాబాను 10 సంవత్సరాలు జైలులో ప్రభుత్వం ఎందుకు నిర్బంధించిందోప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు.
ఆదివాసుల హక్కుల కోసం పోరాడినందుకు, జాతుల సమస్య పై పోరాటం చేసినందుకు, దోపిడీ లేని సమాజాన్ని కల కన్నందుకు సాయిబాబా ను రాజ్యం నిర్భంధించిందన్నారు. చివరకు 10సంవత్సరాల తర్వాత నిర్షోషి అని తీర్పు వచ్చిందని గుర్తు చేశారు. అనంతరం ప్రొఫెసర్ కాశీం మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి అలుపెరుగకుండా 30 సంవత్సరాలు ప్రజల కోసం పోరాటం చేసిన మహా విప్లవ కారుడు సాయిబాబా అన్నారు.
కార్యక్రమానికి ఓయూ రీసెర్చ్ స్కాలర్ ఆజాద్ అధ్యక్షత వహించగా కార్యక్రమంలో ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ప్రొఫెసర్ కొండ నాగేశ్వరరావు, ప్రొఫెసర్. ఆమంచి నాగేశ్వరరావు, సాయిబాబా కూతురు మంజీర, సాయిబాబా తమ్ముడు రాందేవ్, విద్యార్థి సంఘాల నాయకులు వరంగల్ రవి, శరత్ చమర్, సునీల్ శెట్టి,రవినాయక్ సత్య, ఎస్. నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.