ఎల్​అండ్​టీ లాభం రూ. 2,786 కోట్లు

ఎల్​అండ్​టీ లాభం రూ. 2,786 కోట్లు

న్యూఢిల్లీ:  ఇంజనీరింగ్  నిర్మాణ సంస్థ లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్​అండ్​టీ)కు  జూన్ క్వార్టర్​లో  నికర లాభం (కన్సాలిడేటెడ్​) సంవత్సరానికి 12శాతం పెరిగింది రూ. 2,786 కోట్లకు చేరుకుంది. ఈసారి దీనికి రూ. 2,989 కోట్ల లాభం వస్తుందన్న ఎనలిస్టుల అంచనాలు నిజం కాలేదు.  భారీ ఆర్డర్‌‌‌‌ బుక్‌‌‌‌ కారణంగా కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం సంవత్సరానికి 15శాతం పెరిగి రూ. 55,120 కోట్లకు చేరుకుంది. 

మిడిల్​ఈస్ట్ నుంచి బలమైన డిమాండ్ ఉండటంతో  కంపెనీ మొదటి క్వార్టర్​లో గ్రూప్ స్థాయిలో రూ. 70,936 కోట్ల విలువైన ఆర్డర్లను అందుకుంది. సంవత్సరానికి 8శాతం వృద్ధి సాధించింది. హైడ్రోకార్బన్ వ్యాపారం, పునరుత్పాదక వస్తువులు, ట్రాన్స్‌‌‌‌మిషన్  పంపిణీ, రోడ్లు, న్యూక్లియర్ పవర్, హైడల్  టన్నెల్, ఫెర్రస్ మెటల్స్, హెల్త్  ప్రెసిషన్, ఇంజినీరింగ్ సెక్టార్‌‌‌‌ల వంటి పలు విభాగాల్లో ఆర్డర్లు వచ్చాయి.ఈ క్వార్టర్​లో అంతర్జాతీయ ఆర్డర్ల విలువ రూ. 32,598 కోట్లకు చేరింది.