రైతులకు గుడ్​ న్యూస్​ : లాభాల పంట... తమలపాకుల సాగు.. కలకత్తా ఆకు పండిస్తే డబ్బులే.. డబ్బులు..

రైతులకు గుడ్​ న్యూస్​ : లాభాల పంట...  తమలపాకుల సాగు.. కలకత్తా ఆకు పండిస్తే డబ్బులే.. డబ్బులు..

కలకత్తా పాన్ ఎంత ఫేమసో అందరికీ తెలుసు.. ఆపాన్​ ని  ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. దానికంత రుచి ఎలా వచ్చిందంటారా? కోల్​కతాలో పండే ఒక రకమైన స్పెషల్ తమలపాకులతో ఆ పాన్ కడతారు. ఆ ఆకు వల్లే దానికి అంత రుచి.. సాధారణంగా ఆ తమలపాకులు మన దగ్గర పండవు. కానీ.. అనేక జాగ్రత్తలు తీసుకుని, ఉత్తర తెలంగాణలో పండిస్తున్నాడు ఓ బెంగాలి రైతు. మొదట్లో నష్టాలు వచ్చినా ఇప్పుడు మాత్రం బాగానే గిట్టుబాటు అవుతోంది అంటున్నాడు  ఆ రైతు .. 

 మన దగ్గర పండదు అనుకున్న పంటను పండించి ఔరా అనిపించాడు బెంగాలీ రైతు ....కాగజ్ నగర్ డివిజన్ లోని సిర్పూర్ టీ మండలంలోని లక్ష్మీ పూర్లో ఉంటున్నాడు. చాలా ఏళ్ల క్రితం వాళ్ల కుటుంబం బెంగాల్ నుంచి ఇక్కడికి వచ్చింది. నాలుగేళ్ల నుంచి కలకత్తా తమలపాకుల (తేజ్ పత్తా)ను ఉత్తర తెలంగాణలో పండిస్తున్నాడు. 

ఆలోచన ఎలా వచ్చింది? 

 గతంలో  ఆ రైతు తనకున్న నాలుగెకరాల్లో వరి పండించేవాడు. కానీ.. ఎప్పుడూ అశించినంతగా లాభాలు రాలేదు. అందుకే కొత్త పంట ఏదైనా సాగు చేయాలనుకున్నాడు. అదే టైంలో  ఆయన ఒకసారి బంధువుల ఇంటికి కోల్​ కతా వెళ్లాడు. అక్కడ కలకత్తా తమలపాకులు పండిస్తున్న విధానం చూశాడు. అది చూశాక తను కూడా తమలపాకులు పండించాలని అనుకున్నాడు. ముందుగా 60 వేల పెట్టుబడితో అరెకరంలో సాగు మొదలుపెట్టాడు.

ఫస్ట్లో లాస్.. ఇప్పుడు సక్సెస్ 

కలకత్తా తమలపాకుల సాగు మొదలుపెట్టినప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాడు. సాగు కోసం తెచ్చిన మొక్కలను బతికించుకునేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు. ఎంతో కష్టపడితే కానీ.. అవి ఎదగలేదు.. ఇప్పుడు ఎదిగిన తర్వాత ఏ సమస్యా లేదంటున్నాడు ఆ రైతు. అతను సాగు మొదలు పెట్టినప్పుడు 'అసలు ఇవి ఇక్కడ బతుకుతాయా? అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటున్నాడు' అన్నోళ్లు ఇప్పుడు ...శభాష్ ... అంటున్నారు. 

ALSO READ | ఎట్టెట్టా​: భగవద్గీత పుస్తకం మాట్లాడుతుంది.. శ్లోకాలను చదువుతుంది...

ఆవాల నుంచి నూనె తీసిన తర్వాత మిగిలిన పిప్పిని ఈ పంటకు ఎరువుగా వేస్తారు. అది కూడా ప్రతి మూడు వారాలకు ఒకసారి వేయాల్సి ఉంటుంది. ఈ ఎరువు మన దగ్గర దొరక్క పోవడంతో ఒరిస్సా, కోల్కతా వెళ్లి తీసుకురావాల్సి వస్తుంది. అందుకు కాస్త ఎక్కువ ఖర్చు అవుతుంది. 

చలువ పందిరి 

తమలపాకుల సాగులో చాలా మెలకువలు పాటించాల్సి ఉంటుంది. మొక్కల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ తమలపాకుల తీగలను నేలమీద పారించకుండా సపోర్ట్ కర్రలు పెట్టి నిటారుగా పైకి పారేలా చేయాలి. తీగలపై నేరుగా సన్​లైట్ పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే గ్రీన్ హౌస్ పైన కప్పి ఉంచాలి. కానీ.. గ్రీన్ మాట్ కొనేంత డబ్బు లేక ఈత చెట్ల కొమ్మలతో పొలం మీద పందిరి వేశాడు. ఎండ ఎక్కువగా ఉండే టైంలో వీటిని కాపాడడం రైతుకు పెద్ద సవాల్ గా మారింది. అందుకే ఈ పంట చుట్టూ రక్షణగా చెరుకు, మునగ, (వెదురు) మొక్కలు పెంచుతున్నాడు. దాంతో పక్క నుంచి వచ్చే ఎండ కూడా పంటపై పడకుండా ఉంటుంది. పొలంలో ఎప్పుడూ చల్లగా ఉంటుంది. 

వారానికి ఐదు వేల ఆకులు 

 సాగు చేస్తున్న తేజ్ తమలపాకులకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. ఈ ఆకులతో చేసే పాన్​కు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. మొదట పెద్దగా దిగుబడి రాలేదు. కానీ.. ఆ తరువాత  రైతుకు ఊహించని లాభాలు తెచ్చిపెడుతోంది. ఇప్పుడు వారానికి రెండుసార్లు ఆకులు కోసి అమ్ముతున్నాడు. కోసిన ప్రతి సారి రెండున్నర వేల ఆకులకు పైగా దిగుబడి వస్తోంది. వర్షా కాలం, చలికాలం సీజన్లో ఒక్కో ఆకు 50పైసలు హోల్​ల్ కాగజ్ నగర్, ఈస్ గాం, సిర్పూర్ టీ మార్కెట్ అమ్ముతున్నారు. 

ఎండాకాలంలో మాత్రం రూపాయికి ఒక ఆకు అమ్ముతున్నాడు. 'ఈ సాగు కోసం నియమ నిష్టలతో ఉంటున్నాం. స్నానం చేసిన తర్వాతే పొలంలో అడుగు పెడతాం. ఇంట్లో వాళ్లం మాత్రమే ఈ పొలంలో పని చేస్తామంని కాగజ్ నగర్ డివిజన్ లోని సిర్పూర్ టీ మండలంలోని లక్ష్మీ పూర్లో  తమలపాకుల సాగు చేసే బెంగాలీ రైతు అంటున్నాడు. 

–వెలుగు,లైఫ్​‌‌–