భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెంలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఓ ప్రయివేట్ హాస్పిటల్‌ను సీజ్ చేసినట్లు ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఎం. మధు వరన్, డిప్యూటీ డెమో ఫైజ్మొహిఉద్దీన్ తెలిపారు. కొత్తగూడెంలోని పలు ప్రయివేట్ హాస్పిటళ్లను బుధవారం తనిఖీ చేశారు.
గణేశ్ టెంపుల్ ఏరియాలో అర్హత లేని వాళ్లు ట్రీట్మెంట్ చేయడంతో పాటు డయాగ్నస్టిక్ నడుపుతున్నట్టు తమ తనిఖీల్లో గుర్తించామని అధికారులు తెలిపారు. ఆయుర్వేదం, ప్రకృతి వైద్యం, హోమియోపతి, సిద్ధ, యునాని, ఫిజియోథెరపీ, ల్యాబ్‌లు, డయాగ్నస్టిక్ సెంటర్లు తప్పనిసరిగా పర్మిషన్స్ తీసుకోవాలన్నారు.