నారీ శక్తితో దేశ ప్రగతి

నారీ శక్తితో దేశ ప్రగతి

స్త్రీలు చెట్టుకు కట్టివేయబడిన ఏనుగులు వంటివారని నేను భావిస్తున్నాను. ఏనుగుకు చెట్టును పెకిలించడం గొప్ప విషయం కాదు, చాలా సులభంగా పెకిలించగలదు. కానీ ఏనుగు బంధించబడిందని అనుకుంటున్నది, అందుకే తన సామర్థ్యాన్ని బయటపెట్టదు. అలాగే స్త్రీలు కూడా. వారు గొప్ప నిర్వాహకులు, కుటుంబానికి మూలం, కష్టపడి పనిచేసే తత్వం ఉన్నవారు. కానీ వారు తమ అధికారాలను ఉపయోగించలేరు లేదా వారి సామర్థ్యాన్ని వెలికితీయలేరు అనే మనస్తత్వానికి బంధించబడ్డారు.

యత్ర నార్యస్తు పూజ్యంతే రమన్తే తత్ర దేవతా... ఈ శ్లోకం వేల సంవత్సరాల క్రితం మన భారతంలో, మన పూర్వీకులకు స్త్రీ శక్తి తెలిసిన కాలంలో రాసింది. ‘స్త్రీలు’ అంటే కేవలం స్త్రీ లింగం మాత్రమే కాదు, అంతకు మించి. వారు కుటుంబానికి, సగం సమాజానికి వెన్నెముకగా నిలుస్తారు. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు నివసిస్తారు. కానీ శతాబ్దాలుగా, వివిధ కారణాల వల్ల కావచ్చు, మన స్త్రీలు వేల సంవత్సరాల క్రితం రోజుల మాదిరిగా కాకుండా లోపల వంట గదులకు పరిమితమవుతున్నారు. 

ప్రాచీన భారతదేశంలో, స్త్రీలు కూడా పురుషులతో సమానంగా పరిగణించబడ్డారు. మేధోపరమైన చర్చలు, పరిపాలన, ఆస్తి వారసత్వం, పాండిత్య జ్ఞానం మొదలైన వాటిలో అవకాశాలు దక్కాయి. ఆ తర్వాతి కాలంలో స్త్రీలకు విద్య, సామాజిక హోదా,  చాలా వరకు ఆమె ఉనికిని నిరాకరించారు. ఆమె కుమార్తెగా, భార్యగా లేదా తల్లిగా మాత్రమే గుర్తించబడుతోంది. సమానత్వం, ధైర్యం, ఆత్మగౌరవం కోల్పోయింది. స్త్రీలు చెట్టుకు కట్టివేయబడిన ఏనుగులు వంటివారని నేను భావిస్తున్నాను. ఏనుగుకు చెట్టును పెకిలించడం గొప్ప విషయం కాదు, చాలా సులభంగా పెకిలించగలదు. కానీ ఏనుగు బంధించబడిందని అనుకుంటున్నది, అందుకే తన సామర్థ్యాన్ని బయటపెట్టదు. అలాగే స్త్రీలు కూడా. వారు గొప్ప నిర్వాహకులు, కుటుంబానికి మూలం, కష్టపడి పనిచేసే తత్వం ఉన్నవారు. కానీ వారు తమ అధికారాలను ఉపయోగించలేరు లేదా వారి  సామర్థ్యాన్ని వెలికితీయలేరు అనే మనస్తత్వానికి బంధించబడ్డారు.

స్ఫూర్తి పొందుతున్న మహిళలు

ఒక మంచి నాయకుడు అతిశయోక్తి లేకుండా నిలకడగా మాట్లాడినప్పుడు ప్రజలు వింటారు, నమ్ముతారు, తర్వాత అనుసరిస్తారు. నేడు వివిధ రంగాల్లో మహిళలు ఎన్నో విజయాలు సాధించారు. ఇలాంటి సందర్భంలో మహిళలు అసాధారణమైన పని చేసినప్పుడు, వారిని ప్రధాని పిలుస్తారు, ప్రశంసిస్తారు. దేశం వారిని అంగీకరిస్తుంది. అలాంటి వారు చాలా మంది యువకులకు ఆదర్శ నమూనాలుగా మారారు. పాలసీలు తమకు అనుకూలంగా ఉన్నాయని, వారు సాధించగలరని వారికి తెలుసు కాబట్టి ఆడపిల్లలు పెద్ద కలలు కంటున్నారు. కొన్ని నెలల క్రితం, నేను నా పనికి సంబంధించి ఒక రూరల్​విలేజ్​ను సందర్శించాను. అక్కడి ప్రజలతో మాట్లాడుతూ విభిన్న అంశాలు పరస్పరం చర్చించుకున్నాం. మా చర్చ ముగిసే సమయానికి, గ్రూప్​లోని యువతులకు నేను చివరి ప్రశ్న వేశాను. ‘మీరు పెద్దయ్యాక ఎలా ఉండాలనుకుంటున్నారు?’ అని అడిగాను. ఒక అమ్మాయి వెంటనే, ‘నేను జోయా అగర్వాల్ అవ్వాలనుకుంటున్నాను’ అని చెప్పింది.  ఆసక్తిగా ఉండి ఎందుకు అని అడిగాను, ఆమె చెప్పింది, ‘మీరు టీవీ చూడరా, పేపర్ చదవరా? జోయా అగర్వాల్ శాన్ ఫ్రాన్సిస్కో నుంచి బెంగళూరుకు ఉత్తర ధ్రువం మీదుగా16,000 కి.మీ.ప్రయాణించే మహిళా పైలట్ బృందాన్ని ఆర్గనైజ్​చేసింది. ఆమె మన ప్రధానిని కలిశారు. నేను ఆమెలా ఉండాలనుకుంటున్నాను’ అని చెప్పింది. మరో అమ్మాయి స్పందిస్తూ ‘నేను ఒలింపిక్స్​లో పాల్గొనాలనుకుంటున్నాను, ఎందుకంటే నేను ఇతర అమ్మాయిలకు రోల్ మోడల్​గా ఉంటాను. ప్రధానమంత్రి ప్రశంసలు పొందుతాను’ అని అన్నది. మూడవ అమ్మాయి లేచి ‘నేను లేడీ ఎంట్రప్రెనూర్ అవ్వాలనుకుంటున్నాను, ఎందుకంటే పీఎంఎంవై వంటి పెద్ద ప్రాజెక్టులు నాకు సహాయపడతాయి’ అని చెప్పింది. వాళ్ల అమ్మ బయటికి వచ్చి, ‘మేడమ్, మాకు ఎల్పీజీ తెచ్చినందుకు నేను ప్రధానమంత్రికి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. ఇది పొగ నుంచి నా కళ్లను  రక్షించింది. నా ఆరోగ్యాన్ని మెరుగుపరిచింది”అని అన్నది.

మహిళా సాధికారత కోసం

ఏదైనా తుఫాను లేదా అలలను ప్రేరేపించడానికి ఒక ప్రారంభ స్థానం అవసరం. సాధికారత, సామర్థ్య స్పృహ ఎలా వస్తుంది, వారికి ఎవరు సాయం చేస్తారు, వారికి ఎవరు భరోసా ఇస్తారు, విశ్వాసం కల్పిస్తారు, వారికి సాయం చేయడానికి పాలసీని ఎవరు రూపొందిస్తారు. మొదటిసారి ఆమె సామర్థ్యాన్ని ఎవరు వెలికితీస్తారు? ఆమెను వంట గదుల నుంచి బయటకు రావడాన్ని ఎవరు అంగీకరిస్తారు, ఆమె కొత్త వెంచర్​ను ప్రారంభించాలనుకున్నప్పుడు ఆమెకు ఎవరు సాయం చేయగలరు, క్రీడలు, ఆరోగ్యం, రక్షణ, విమానయానంలో ఆమె సామర్థ్యాన్ని ఎవరు అభినందిస్తారు? అదే జరిగితే, ఆమె దేశాన్ని నిర్మించడంలో అద్భుతమైన సామర్థ్యంతో ఎదుగుతుంది. కుమార్తెలు దేవుడి విలువైన బహుమతులని స్త్రీల గురించి మాట్లాడుతూ ఓ నాయకుడు అన్నారు. ఆయన దేశంలోని సాధారణ పురుషులు, మహిళలందరితో ప్రత్యక్ష, నిజమైన ఉదాహరణలతో ఒక కార్యక్రమం ద్వారా  జాతినుద్దేశించి మాట్లాడటం ప్రారంభించారు. ఆయన సరైన వాగ్దానం చేశారు., సరైన మాటలతో, సరైన దిశను అనుసరించారు. ‘భేటీ బచావో భేటీ పఢావో’, ‘ప్రధాన మంత్రి ముద్రా యోజన’, ‘ఉజ్వల యోజన’, ‘స్వచ్ఛ్ భారత్ మిషన్’, ‘# సెల్పీ విత్​డాటర్’ లాంటివి అందులో భాగమే. నారీ శక్తిని ప్రోత్సహించి, జాతీయ సంపదను నిర్మించడంలో తమదే బాధ్యత అని గుర్తుపెట్టుకునేలా చేసింది ఎవరు? పిల్లలు పరీక్షలంటే భయపడటం, తల్లిదండ్రుల ఒత్తిడి, మహిళా సాధికారత(నారీ శక్తి) మొదలైన వివిధ సామాజిక సమస్యలు చర్చిస్తూ 2014 నుంచి ‘మన్ కీ బాత్’ ద్వారా చైతన్యం నింపుతున్న ఆ నాయకుడు మరెవరో కాదు మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. మన దేశ ప్రజలతో ఆయన మాట్లాడిన ప్రసార కార్యక్రమాన్ని ‘మన్ కీ బాత్’ అంటున్నాం. అతను వివిధ రంగాలకు చెందిన వివిధ వ్యక్తులతో, వివిధ అంశాల గురించి మాట్లాడతారు.


కృతజ్ఞత వ్యక్తం చేస్తూ..


కొంతమంది వృద్ధ మహిళలు ముందుకు వచ్చి ‘‘మేము మన్ కీ బాత్ వింటాం కానీ వారికి మా ధన్యవాదాలు ఎలా తెలియజేయాలో తెలియదు. మేడమ్, మీరు ఆయనని కలిసినా లేదా ఆయనకి రాసినా, దయచేసి ఈ దేశంలోని మీ సోదరీమణులు కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటున్నారని మా అందరి తరఫున చెప్పండి’’ అని అన్నారు. వారు ఎంత కృతజ్ఞత వ్యక్తం చేయాలనుకుం టున్నారో వారి కన్నీళ్లను చూస్తే తెలిసింది. ఎప్పుడో, ఎక్కడో, ఎలాగోలా వారికి మీ సందేశం తెలియచేస్తానని వాళ్లకు చెప్పాను. మా నారీ శక్తిలో ఆత్మవిశ్వాసంతో కూడిన సాధికారత పరివర్తనను నా మనస్సు అప్రయత్నంగా గమనిస్తోంది. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా అనే శ్లోకం మరోసారి గుర్తుకు వచ్చింది.


- సుధా మూర్తి,
విద్యావేత్త, రచయిత, సామాజిక సేవ కార్యకర్త