
- ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ స్టేట్ చీఫ్ కొరివి వేణుగోపాల్
కరీంనగర్‌టౌన్, వెలుగు : మంత్రి దామోదర రాజనర్సింహపై పెద్దపల్లి మాజీ ఎంపీ వెంకటేశ్ నేత వ్యాఖ్యలు సరికాదని ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ స్టేట్ చీఫ్ కొరివి వేణుగోపాల్ అన్నారు. కరీంనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో సోమవారం మీడియాతో మాట్లాడారు. వెంకటేశ్ నేత వ్యాఖ్యలు ఆయన అవివేకానికి, రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమన్నారు. మాల కులంపై, లీడర్లపై, కాంగ్రెస్ పార్టీపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం సిగ్గుచేటని, ఆయన మాటలను ఖండిస్తున్నామన్నారు. వెంకటేశ్ నేత ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేసిన టైంలో అనేక అవినీతి, అక్రమాలకు పాల్పడ్డాడని ఆరోపించారు.
అవినీతి డబ్బుతో రాజకీయాల్లోకి వచ్చి బీఆర్‌ఎస్‌లో చేరి ఎంపీ అయ్యాడని గుర్తు చేశారు. 2023లో బీఆర్‌ఎస్ అధికారం కోల్పోగానే కాంగ్రెస్‌లో చేరిన ఆయన, టిక్కెట్ ఇవ్వకపోవడంతో బీజేపీలోకి జంప్ అయి పెయిడ్ వర్కర్‌గా మాట్లాడుతున్నారన్నారు. దామోదర రాజనర్సింహ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన వెంకటేశ్ నేత క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. సమావేశంలో నాయకులు రొడ్డ శ్రీనివాస్, బోయినిపల్లి చంద్రయ్య, తాళ్ల వెంకటేశ్, చిగిరి శ్రీధర్, నల్లాల శ్రీనివాస్, బాపురెడ్డి, రవీందర్‌యాదవ్ పాల్గొన్నారు.