చాట్ జీపీటీతో ప్రపంచాన్ని సరికొత్త యుగంలోకి నడిపించిన ఓపెన్–ఏఈ ప్రవేశపెట్టిన జీపీటీ–4.0కి పోటీగా ప్రాజెక్టు అస్త్ర పేరిట గూగుల్ మల్టీ మోడల్ ఏఐ అసిస్టెంట్‌ను రూపొందిస్తోంది. ఇది ఒక వర్చువల్ అసిస్టెంట్. డివైజ్ కెమెరా ద్వారా ఏ వస్తువు ఎక్కడ ఉందో చూసి స్టోర్ చేసి పెట్టుకుంటుంది. గూగుల్ ప్రాజెక్టు అస్త్రతో ఏఐ టూల్, మనిషి భావోద్వేగాలకు అచ్చం మనిషి తరహాలోనే 232 మిల్లీ సెకండ్లలో సమాధానాలిస్తాయి. వేగం, కచ్చితత్వం, అదే సమయంలో ఎమోషన్స్ పలికించడం ఈ వెర్షన్ల ప్రత్యేకత.
- మనుషులు చెప్పిన మాటలు గుర్తుంచుకోవడం, అర్థం చేసుకోవడం, అవసరమైనట్లుగా స్పందిస్తుంది. మనుషులతో మాట్లాడటమే కాకుండా కొన్ని పనులను కూడా చేస్తుంది. రోజువారీ మానవ జీవితంతో భాగమయ్యేలా దీన్ని తీర్చిదిద్దుతుంది. ఓపెన్ ఏఐ జీపీటీ4.0ను 2023లోనే తీసుకొచ్చింది. ఇందులో రియల్ టైమ్ సంభాషణలు, వాయిల్ ఎమోషన్లు, టెక్స్ట్విజన్ తదితర ఫీచర్లు మనుషులతో మాట్లాడుతున్న అనుభూతినిస్తుంది.
- జీపీటీ4.0 మోడల్ తెలుగు సహా 50 భాషలను సపోర్టు చేస్తుంది. టెక్స్ట్, రీజనింగ్, కోడింగ్ ఇంటెలిజెన్స్‌ను వేగంగా పూర్తిచేస్తుంది. స్పీచ్ మోడల్లో రియల్ టైమ్ రెస్పాన్స్ ఉంటుంది. చాట్ జీపీటీ 4.0 రెండు రెట్లు వేగంగా పనిచేస్తుంది.
- మనిషి వాయిస్ కమాండ్లకు మనిషి తరహాలోనే సమాధానాలిస్తాయి. అలాగే, ఓ ఫోన్లోని ఏఐ మోడల్ మరో ఫోన్లోని ఏఐ మోడల్తోనూ సంభాషిస్తుంది. మనం ఒక సెల్ఫీ తీసుకుంటే మన మానసిక స్థితిని విశ్లేషిస్తుంది.