ఈసారి నాగార్జున సాగర్ ఆయకట్టుకు నీటి విడుదల లేదని ప్రాజెక్టు సీఈ అజయ్ కుమార్ చెప్పారు. ఉన్న నీరు కేవలం తాగునీటి అవసరాలకే ఉపయోగిస్తామని స్పష్టం చేశారు. సాగర్ ఆయకట్టులో రబీ సీజన్ క్రాప్ హాలీడే ఉన్న విషయాన్ని రైతులందరూ గమనించాలని ముందే హెచ్చరించారు.
చాలా రోజుల నుంచి నీళ్లు లేక నాగార్జునసాగర్ఎడమ ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. శ్రీశైలం నుంచి ఇన్ఫ్లో లేకపోవడంతో రిజర్వాయర్ వెలవెలబోతోంది. గతేడాది నైరుతి రుతు పవనాల ప్రభావంతో జూన్, జూలై నెలల్లో కృష్ణా బేసిన్లో భారీ వర్షాలు కురిశాయి.
తెలంగాణ, ఏపీలో కలిపి సాగర్ఎడమకాలువ ఆయకట్టు సాగు విస్తీర్ణం 1 0.37 లక్షల ఎకరాలు. దీంట్లో ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలో 6.62 లక్షల ఎకరాల పారకం ఉంది. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కలిపి మరో 3.75 లక్షల ఎకరాలు సాగవుతోంది.