బాల్కొండ,వెలుగు: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువల్లో ఒకటైన వరద కాలువకు నీటి విడుదల 18వేల క్యూసెక్కులకు పెంచినట్లు ప్రాజెక్టు ఆఫీసర్లు తెలిపారు. ప్రాజెక్టు ఎగువ నుంచి వచ్చే వరదను బట్టి దిగువకు వదులుతున్నట్టు చెప్పారు. బుధవారం ఉదయం 45 వేల క్యూసెక్కుల వరద రాగా, మధ్యాహ్నానికి 33వేలకు తగ్గింది.7 వరద గేట్ల నుంచి 2 గేట్లకు తగ్గించి 6 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు.
కాకతీయ కాలువ ద్వారా 6800 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 1200 క్యూసెక్కుల నీటి పంపుతున్నారు. జలవిద్యుత్ కేంద్రంలోని 4 టర్బైన్ల ద్వారా 36 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని జెన్ కో డీఈ శ్రీనివాస్ తెలిపారు.ప్రాజెక్టు నీటిమట్టం పూర్తిస్థాయికి చేరడంతో వివిధ కాలువలకు నీటిని వదులుతున్నామని చెప్పారు.