
ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్(ఈఐఎల్) 42 మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ కోరుతోంది.
ఖాళీలు: కెమికల్ విభాగంలో 5, మెకానికల్ 16, సివిల్ 9, ఎలక్ట్రికల్ 7, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత సాధించడంతో పాటు గేట్ 2023 అర్హులై ఉండాలి. అభ్యర్థులు ఆన్‌లైన్ ఫిబ్రవరి 22 నుంచి మార్చి 14 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.engineersindia.com వెబ్సైట్ సంప్రదించాలి.
సీడ్యాక్-లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు
సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్(సీడ్యాక్) కాంట్రాక్ట్ ప్రాతిపదికన దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతాల్లో పనిచేయుటకు 570 ప్రాజెక్ట్ స్టాప్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీలు: ప్రాజెక్ట్ అసోసియేట్-30, ప్రాజెక్ట్ ఇంజినీర్-300, ప్రాజెక్ట్ మేనేజర్ -40, సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్-200 పోస్టులు ఉన్నాయి.
సెలెక్షన్ ప్రాసెస్: రాతపరీక్ష, ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా సెలెక్షన్ ఉంటుంది. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా ఫిబ్రవరి 20 వరకు దరఖాస్తు చేసుకోవాలి. సమాచారం కోసం www.cdac.in వెబ్సైట్లో సంప్రదించాలి.