ఈ వానాకలంలోనే రైతులకు ప్రాజెక్టు నీళ్లు : మంత్రి తుమ్మల

ఈ వానాకలంలోనే రైతులకు ప్రాజెక్టు నీళ్లు : మంత్రి తుమ్మల

 పెద్దవాగు ప్రాజెక్టు ఆనకట్ట మరమ్మత్తు పనులు సత్వరమే చేపట్టాలని ఇరిగేషన్ అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలు జారీ చేశారు. ఈ వానాకాలం సీజన్ లోనే రైతులకు సాగునీరు పంటలకు అందే విధంగా యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని మరమ్మత్తులు కోసం ఎస్టిమేట్స్ సిద్ధం చేయాలని సూచించారు. తాత్కాలిక పనుల కోసం బండ్ ఫార్మేషన్ అప్రోచ్ కెనాల్ పనులు కోసం రూ. 3 కోట్ల 50 లక్షలతో ఎస్టిమేట్స్ సిద్ధం చేశారు ఇరిగేషన్ అధికారులు. 

పెద్దవాగు ప్రాజెక్ట్ తాత్కాలిక మరమ్మత్తులు కోసం నిధులు మంజూరు చేయాలని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నిధులు మంజూరు చేయాలని కోరారు.  అతి భారీ వర్షం వరదలతో పెద్దవాగు ప్రాజెక్ట్ ఆనకట్టకు గండ్లు పడగా అర టీఎంసీ నీరు ఖాళీ అయ్యింది. ఈ సీజన్ లోనే ప్రాజెక్ట్ ఆయకట్టు కింద పంటలు సాగు కోసం తాత్కాలిక మరమ్మత్తులు  చేపట్టి సాగునీరు ఇవ్వాలని ఇరిగేషన్ అధికారులకు మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. 

నిధులు మంజూరు చేయించే భాధ్యత నాది రైతులకు సాగు నీటి కష్టాలు రాకుండా చూడాలని కోరారు. పెద్దవాగు ప్రాజెక్ట్ మరమ్మత్తు పనులు కోసం సాయం అందించడం లో వెంటనే స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి మంత్రి తుమ్మల కృతజ్ఞతలు తెలిపారు..