గౌతమ్ ఆదానీ చుట్టూ మహా ఎన్నికల ప్రచారం

గౌతమ్ ఆదానీ చుట్టూ మహా ఎన్నికల ప్రచారం

ముంబై: ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కాగా నిన్న నాందేడ్ లో కాంగ్రెస్ అగ్రనేత ర్యాలీ నిర్వహించి ప్రధాని నరేంద్ర మోదీపై సంచలన ఆరోపణలు, విమర్శలు చేశారు. మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం కూలిపోవడానికి కారణం మోదీనే అని అన్నారు.  "ప్రభుత్వాన్ని కూల్చింది ఎవరు?" అని రాహుల్ గాంధీ ప్రజలను అడిగారు. ‘‘ దీని వెనుక మోదీ హస్తం లేదా ? అన్నారు. 

ఈ కుట్రలో గౌతమ్ అదానీ కూడా ఉన్నారని ఆరోపించారు. అసలు అదానీ ఆసమావేశానికి ఎందుకు వచ్చారు? అని ప్రశ్నించారు. ఎందుకంటే షిండే నేతృత్వంలోని ప్రభుత్వం ఆయనకు రూ. లక్ష కోట్ల విలువైన ఆస్తులను కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అలాగే మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలు ఈ ఆరోపణలకు బలం కలిగించాయి. ఐదేళ్ల క్రితం బీజేపీ, ఎన్సీపీ ప్రభుత్వం ఏర్పాటు సమయంలో జరిగిన సమావేశానికి అదానీ ఉన్నారని అజిత్ పవార్ అన్నారు. 

న్యూఢిల్లీలోని ఆయన నివాసంలోనే ఈ సమావేశం జరిగిందని చెప్పుకొచ్చారు. అయితే కేవలం విందుకు మాత్రమే తన ఇంటికి పిలిచానని, అందులో రాజకీయ చర్చ లేదని గౌతమ్ అదానీ చెప్పినా.. ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని లేపుతున్నాయి.