- గుండెపోటుతో ముంబైలో తుదిశ్వాస
- 1938లో జమ్మూలో జన్మించిన శివ కుమార్ శర్మ
- శాస్త్రీయ సంగీతంలో ప్రత్యేక స్థానం
- దేశ విదేశాల్లో ఎన్నో ప్రదర్శలు ఇచ్చిన శర్మ
- శివకుమార్ కు భార్య మనోరమ, కుమారుడు రాహుల్ శర్మ
- రాహుల్ శర్మ కూడా సంతూరు విద్వాంసుడే
ముంబై : ప్రముఖ సంగీత విద్వాంసుడు, సంతూర్ వాయిద్యకారుడు పండిట్ శివకుమార్ శర్మ(84) కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో ముంబైలో తుదిశ్వాస విడిచారు. గతంలో పద్మవిభూషణ్ అవార్డు కూడా అందుకున్నారు. భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ శాస్త్రీయ సంగీత విద్వాంసులలో ఒకరిగా మంచి పేరు తెచ్చుకున్నారు. వచ్చే వారం భోపాల్‌లో ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. ఇంతలోనే గుండెపోటుతో చనిపోయారు. 1938లో జమ్మూలో జన్మించిన శివ కుమార్ శర్మ.. ఆ రాష్ట్రం నుంచి తొలి జానపద వాయిద్యకారుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
శాస్త్రీయ సంగీతంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న పండిత్ శివకుమార్ దేశ విదేశాల్లో ఎన్నో ప్రదర్శలు ఇచ్చారు. కేవలం సంప్రదాయ వాయిద్యకారుడు మాత్రమే కాదు.. శాంతారామ్ తీసిన ‘జనక్ జనక్ పాయల్ బాజే’(1956) చిత్రానికి తొలిసారిగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. 1960లో ఆయన తన తొలి సోలో ఆల్బమ్‌ను తీశారు. శివ-హరి ద్వయం మ్యూజిక్ డైరెక్టర్లుగా గుర్తింపు పొందిన వాళ్లలో ఒకరే ఈయన. ఇందులో ఒకరు ప్రముఖ ఫ్లూట్ విద్వాంసుడు హరి ప్రసాద్ చౌరాసియా కాగా.. మరొకరు శివకుమార్ శర్మ. వీళ్లిద్దరూ కలిసి సిల్‌సిలా, లమ్హే, ఫాస్లే, చాందినీ, షారూక్‌ఖాన్ ‘డర్’ చిత్రాలకు పని చేశారు.
శివకుమార్ భార్య పేరు మనోరమ. కుమారుడు రాహుల్ శర్మ. ఈయన కూడా సంతూరు విద్వాంసుడే. తన కుమారుడే తన ప్రియ శిష్యుడని, తనకు దేవుడిచ్చిన వరమని గతంలో చాలా ఇంటర్వ్యూల్లో శివకుమార్ చెప్పారు. శివకుమార్ శర్మ మృతి పట్ల భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలియజేశారు.
President Kovind condoles demise of Pt Shiv Kumar Sharma
— ANI Digital (@ani_digital) May 10, 2022
Read @ANI Story | https://t.co/nanhzuXEUh#presidentkovind #panditshivkumarsharma #ramnathkovind pic.twitter.com/D9CCCzFJRH
Our cultural world is poorer with the demise of Pandit Shivkumar Sharma Ji. He popularised the Santoor at a global level. His music will continue to enthral the coming generations. I fondly remember my interactions with him. Condolences to his family and admirers. Om Shanti.
— Narendra Modi (@narendramodi) May 10, 2022
శివకుమార్ శర్మ మరణం తనకు వ్యక్తిగతంగా తీరని లోటని సరోద్ వాద్యకారుడు అమ్జద్ అలీ ఖాన్ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని చెప్పారు.
The passing away of Pandit Shiv Kumar Sharmaji marks the end of an era. He was the pioneer of Santoor and his contribution is unparalleled. For me, it’s a personal loss and I will miss him no end. May his soul rest in peace. His music lives on forever! Om Shanti ?? pic.twitter.com/GcLSF0lSh2
— Amjad Ali Khan (@AAKSarod) May 10, 2022
మరిన్ని వార్తల కోసం..