ప్రగతి భవన్ ను ముట్టడిస్తాం: వెరబెల్లి రఘునాథ్​

నస్పూర్, వెలుగు:-  సింగరేణి కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికుల వేతనాలు పెంచకపోతే త్వరలో కార్మికులతో కలిసి ప్రగతి భవన్ ను  ముట్టడిస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్​హెచ్చరించారు ఆదివారం సీసీసీ కార్నర్ వద్ద ఏర్పాటు చేసిన కార్మిక దీక్షలో ఆయన  మాట్లాడుతూ  కాంట్రాక్ట్ కార్మికులకు ఇచ్చిన హామీలను సీఎం కేసిఆర్ విస్మరించారన్నారు. రెగ్యులరైజ్ చేస్తామని ఇచ్చిన హామీని ఇప్పటి వరకు నెరవేర్చలేదన్నారు.

  బీజేపీ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు అందించి, కోల్ ఇండియాలో కల్పిస్తున్న సౌకర్యాలు కల్పిస్తామమి హామీ ఇచ్చారు.  కార్యక్రమంలో పోనుగోటి రంగారావు, అగల్ డ్యూటీ రాజు, కషెట్టి నాగేశ్వర్ రావు, మిట్టపల్లి మొగిలి, కడాసు భీమయ్య, తదితరులు పాల్గొన్నారు.