
ఎలాన్ మస్క్.. ఏది చేసినా సంచలనమే.. ఇటీవల స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ ను పంపి అంతరిక్షంలో చిక్కుకుపోయిన ఆస్ట్రోనాట్స్ ను భూమి మీదకు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు ట్రంప్. ఇదిలా ఉండగా.. ట్రంప్ తో కలిసి డిన్నర్ కి వెళ్లిన మస్క్ సరదాగా చేసిన చిన్న స్టంట్ ఇప్పుడు ఇంటర్నెట్ ను ఊపేస్తోంది. డిన్నర్ టేబుల్ దగ్గర కూర్చున్న మస్క్ తన చేతి వేళ్ళపై స్పూన్స్, ఫోర్క్స్ బ్యాలన్స్ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Also Read:-భర్తకు అప్పగించడం ఇష్టంలేక కొడుకు గొంతు కోసింది..
ఇది కచ్చితంగా ఫిజిక్స్ కి రిలేటెడ్ అంశమే అని.. మస్క్ త్వరలోనే ఎదో కొత్త టెక్నాలజీని లాంచ్ చేయబోతున్నట్లు ఉందని.. ఆ టెక్నాలజీ గురించి ఆలోచిస్తూ ఈ స్టంట్ చేశాడేమో అంటూ నెటిజన్ సరదాగా కామెంట్ చేశాడు. మస్క్ పక్కనే కూర్చున్న తన వైఫ్ మస్క్ స్పూన్స్ స్టంట్ ని ఆసక్తిగా చూస్తూ కూర్చుంది.
A fork and two spoons balanced on the tip of my finger
— Elon Musk (@elonmusk) March 22, 2025
ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే.. ట్రంప్ ఏర్పాటు చేసిన ఈ డిన్నర్ పార్టీలో ఒక్కో గెస్ట్ పై 1 మిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు వార్తలొస్తున్నాయి. మొత్తానికి మస్క్ టైం పాస్ కి చేసిన సరదా స్టంట్ కే ఇంటర్నెట్ షేక్ అయ్యింది.