
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య బహిరంగ వాగ్వాదంపై రష్యా స్పందించింది. ఉక్రెయిన్ కు సరైన గుణపాఠం ఇది..ఆ పందిని (జెలెన్ స్కీని ఉద్దేశించి) తన్నకుండా ఎలా వదిలారు.. ట్రంప్, వాన్స్ ఓపికకు హ్యాట్పాఫ్ అంటూ రష్యా వర్గాలు సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేశారు.
ఓవల్ కార్యాలయంలో జరిగిన పరిణామాలపై రష్యా మాజీ అధ్యక్షుడు డిమిత్రి మెద్వెదేవ్ స్పందిస్తూ.. ఓవల్ ఆఫీసులో ఆ దురహంకార పందికి చివరకు సరైన గుణపాఠం అంటూ Xలో పోస్ట్ చేశారు. ట్రంప్, అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ కూడా ఉన్నారు.. ఆ దుష్టుడిని కొట్టకుండా వదిలేశారని ,ట్రంప్ ,వాన్స్ తమను తాము ఎలా నిగ్రహించుకున్నారు.. ఈ దుష్టుడిని ఎందుకు కొట్టలేదు..వారి ఓర్పు అద్భుతం" అని సైనికాధికారి జఖరోవా టెలిగ్రామ్‌లో రాశారు. వైట్ హౌస్ పై జెలెన్స్కీ తన అబద్ధాల న్నింటిలో అతిపెద్ద అబద్ధం 2022లో కైవ్ పాలన మద్దతు లేకుండా ఒంటరిగా మిగిలిపోయిందని చేసిన ప్రకటన అని నేను భావిస్తున్నాను. అంటూ పోస్ట్ షేర్ చేశారు.
మరోవైపు అమెరికా చేసిన సాయాన్ని ఉక్రెయిన్ ఎలా దుర్వినియోగం చేసింది..అమెరికాను ఎలా మోసం చేసిందో వాషింగ్టన్ దర్యాప్తు చేపడుతున్నదని అమెరికా సీనియర్ అధికారులు అంటున్నారు. అమెరికా ఆర్థిక, భద్రతా పరమైన సాయంపై ఎలాన్ మస్క్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వ సామర్థ్య విభాగం పరిశీలిస్తుందని , ఆ ప్రయత్నాలు వేగవంతం చేసినట్లు తెలిపారు.