హైదరాబాద్​లో పెరుగుతున్న ఫ్లాట్ల సైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్​లో పెరుగుతున్న ఫ్లాట్ల సైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • ఏడు సిటీలలో క్యూ4 లో  సగటు సైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 1,170 నుంచి 1,225 చదరపు అడుగులకు..
  • ఢిల్లీలో ఎక్కువగా..ముంబైలో డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • కరోనా తర్వాత నుంచి పరిస్థితులు మారాయన్న అనరాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

న్యూఢిల్లీ: పెద్ద ఇండ్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ  డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చేరుకోవడానికి డెవలపర్లు కూడా తాము కడుతున్న ఫ్లాట్ల సైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను పెంచుతున్నారు. దేశంలోని టాప్ ఏడు సిటీలలో ఈ ఏడాది జనవరి–మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (క్యూ4) ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లాంచ్ అయిన ఫ్లాట్ల యావరేజ్ సైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కిందటేడాదితో ఇదే క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే 5 శాతం పెరిగిందని ప్రాపర్టీ కన్సల్టంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనరాక్ పేర్కొంది.  కిందటేడాది జనవరి – మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లాంచ్ అయిన ఫ్లాట్ల యావరేజ్ సైజ్ 1,170 చదరపు అడుగులు ఉండగా, ఈ ఏడాది మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇది 1,225 చదరపు అడుగులకు చేరుకుందని వివరించింది.

ఈ ఏడు సిటీలలో ఢిల్లీ–ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫ్లాట్ల సైజ్ ఎక్కువగా పెరిగింది. కిందటేడాది మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లాంచ్ అయిన ఫ్లాట్ల సైజ్  1,130 చదరపు అడుగులు ఉండగా, ఈ ఏడాది క్యూ4 లో ఇది 50 శాతం పెరిగి 1,700 చదరపు అడుగులకు ఎగిసింది.  ఢిల్లీలోని డెవలపర్లను ట్రెండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను జాగ్రత్తగా గమనిస్తున్నారని, పెద్ద ఫ్లాట్లను లాంచ్ చేస్తున్నారని అనరాక్ పేర్కొంది. కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతాలో అయితే ఫ్లాట్ల యావరేజ్ సైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 44 శాతం పెరిగి 800 చదరపు అడుగుల నుంచి 1,150 చదరపు అడుగులకు ఎగిసింది. 

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 29 శాతం అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని రియల్ ఎస్టేట్ డెవలపర్లు కూడా పెద్ద ఇండ్లు తేవడంపై ఫోకస్ పెడుతున్నారు. కిందటేడాది మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లాంచ్ అయిన ఫ్లాట్ల సగటు సైజ్ 1,700 చదరపు అడుగులు ఉండగా, ఈ ఏడాది క్యూ4 లో ఈ నెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2,200 చదరపు అడుగులుగా నమోదయ్యింది.  ఇది 29 శాతం గ్రోత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సమానం. పుణెలో ఫ్లాట్ల సగటు సైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 16 శాతం పెరిగి 877  చదరపు అడుగుల నుంచి 1,013 చదరపు అడుగులకు పెరిగింది.

  బెంగళూరులో 8 శాతం గ్రోత్ కనిపించింది. ఈ సిటీలో ఈ ఏడాది మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లాంచ్ అయిన ఇండ్ల  సగటు సైజ్ 1,300 చదుపు అడుగులుగా రికార్డయ్యింది. చెన్నై , ముంబైలో మాత్రం ఇండ్ల సైజ్ తగ్గింది. చెన్నైలో కిందటేడాది మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లాంచ్ అయిన ఫ్లాట్ల సగటు సైజ్ 1,250 చదరపు అడుగులుగా ఉంటే ఈ ఏడాది మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈ నెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 1,175 చదరపు అడుగులకు తగ్గింది.  ముంబై మెట్రోపాలిటన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రీజియన్ (ఎంఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) లో ఫ్లాట్ల సగటు సైజ్ 5 శాతం తగ్గి 743 చదరపు అడుగులుగా ఉంది.   

గత ఐదేళ్లలో  పైకి..

చిన్న ఇండ్ల డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చేరుకోవడానికి కరోనాకు ముందు ఫ్లాట్ల సైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు తగ్గేవని అనరాక్ చైర్మన్ అనుజ్​ పూరి అన్నారు. ధరలకు, లో మెయింటెనెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కొనుగోలుదారులు  ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారని చెప్పారు. కానీ, 2020 లో కొనుగోలుదారుల ప్రిఫరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు మారిపోయాయని అభిప్రాయపడ్డారు. వర్క్ ఫ్రమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హోమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్టడీ ఫ్రమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హోమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కల్చర్ విస్తరిస్తుండడంతో  ఫ్లాట్ల సైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు  గత నాలుగేళ్లలో మొదటిసారిగా పెరిగాయని అనుజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పూరి అన్నారు. ఈ ఏడాది ప్రాపర్టీల ధరలు తగ్గుతున్నా, పెద్ద ఇండ్లకు డిమాండ్ కొనసాగుతోందని  వివరించారు.

అనరాక్ డేటా ప్రకారం, గత ఐదేళ్లలో అందుబాటులోకి వచ్చిన ఫ్లాట్ల సగటు సైజ్ 7 రియల్ ఎస్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్కెట్లలో ఏడు శాతం మేర పెరిగింది.  ఈ ఏడు సిటీలలో  2018 మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లాంచ్ అయిన ఫ్లాట్ల సగటు సైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 1,150 చదరపు అడుగులు ఉంటే, ఈ ఏడాది మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాటికి ఈ నెంబర్ 1,225 చదరపు అడుగులకు పెరిగింది. ఒక్క ముంబైలోనే గత ఐదేళ్లలో  ఫ్లాట్ల సగటు సైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 932 చదరపు అడుగుల నుంచి 743 అడుగులకు తగ్గింది. ఢిల్లీలో ఎక్కువగా పెరిగింది. ఢిల్లీ– ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫ్లాట్ల సైజ్ 1,250 చదరపు అడుగుల నుంచి 1,700  చదరపు అడుగులకు ఎగిసింది.