
హైదరాబాద్, వెలుగు: కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (క్రెడాయి) హైదరాబాద్ ప్రాపర్టీ షో 13వ ఎడిషన్ ను మార్చి 8 నుంచి హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో నిర్వహించనుంది. ఈ ప్రాపర్టీ షో ద్వారా సిటీలోని వివిధ ప్రాజెక్ట్‌ల గురించి బయ్యర్లు తెలుసుకోవచ్చు. మూడు రోజుల పాటు జరిగే ఈ షోలో 66 స్టాళ్లలో రూ.30 లక్షల నుంచి రూ.12 కోట్ల వరకు విలువ గల 400 ప్రాపర్టీలను ప్రదర్శించనున్నారు.