వాకర్స్కు గుడ్ న్యూస్.. కేబీఆర్​పార్క్​వద్ద మల్టీ లెవల్​పార్కింగ్

  • 15,500 కొత్త ఎల్ఈడీ స్ట్రీట్ లైట్లు కొనాలని నిర్ణయం
  • బల్దియా స్టాండింగ్​ కమిటీ మీటింగులో 14 అంశాలకు ఆమోదం

హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన గురువారం స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. సభ్యులు 14 అంశాలకు ఆమోదం తెలిపారు. ఇందులో ప్రధానంగా కేబీఆర్ పార్క్​మెయిన్​గేట్ వద్ద మల్టీలెవల్ స్మార్ట్ కారు, మోటార్ సైకిల్ పార్కింగ్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను ఆమోదించారు. పార్కింగ్​అభివృద్ధి, నిర్వహణ బాధ్యతలను10 సంవత్సరాలపాటు నవనిర్మాణ్ అసోసియేషన్ సంస్థకు ఇవ్వాలని నిర్ణయించారు. 

లాగే రూ.2కోట్ల98లక్షల72వేలతో 15,500 కొత్త ఎల్ఈడీ స్ట్రీట్ లైట్లు కొనడానికి పరిపాలన అనుమతి, షార్ట్ టెండర్లను పిలవడానికి ఆమోదం తెలిపారు. జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న 90 మంది కమ్యూనిటీ కో-ఆర్డినేటర్లు, కమ్యూనిటీ ఆర్గనైజర్ల పే స్కేల్ ను పెంచుతూ, గతేడాది ఏప్రిల్ నుంచి వర్తింపు చేయాలన్న ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. సమావేశంలో కమిషనర్ ఆమ్రపాలి, స్టాండింగ్ కమిటీ సభ్యులు, అడిషనల్ కమిషనర్లు తదితర అధికారులు పాల్గొన్నారు.