హైదరాబాద్ : మరొకొద్ది రోజుల్లో గడువు పూర్తవుతున్న సమయంలో GHMC స్టాండింగ్ కమిటీ సభ్యులు తమకు ఐ ఫోన్ లు కావాలంటూ పట్టుబట్టారు. అదికూడా ఐఫోన్ 12 ప్రొ, 512 జిగా బైట్స్ సామర్థ్యం ఉన్న ఫోన్ లు కావాలని అడిగారు. ఇందుకోసం ప్రతిపాదనలు కూడా పంపించారు. ఈ ఫోన్లు కొనడానికి మొత్తం 27లక్షల 23వేల 740 రూపాయలు ఖర్చు అవుతోందని అంచనా వేశారు. అయితే మార్కెట్లో ఈ ఫోన్లు స్టాక్ లేకపోవడంతో కొనుగోళ్లను GHMC వాయిదావేసింది. మరో నెలా 15రోజుల్లో GHMC పాలకమండలి గడువు ముగుస్తుండగా.. ఐఫోన్ల కోసం స్టాండింగ్ కమిటీ సభ్యులు ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులకు చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది.