పాలేరు పార్కు అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం

పాలేరు పార్కు అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం

కూసుమంచి, వెలుగు : పాలేరు పార్కును శుక్రవారం ఖమ్మం అడిషనల్​కలెక్టర్​ శ్రీజ, డీఎఫ్​వో  సిద్ధార్థ్​ విక్రమ్​ సింగ్, జిల్లా టూరిజం శాఖ అధికారి సుమన్​చక్రవర్తి సందర్శించారు. పార్కు అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పార్క్​కు మంత్రి పొంగులేటి చొరవతో రూ.5 కోట్లు మంజూరు కాగా,  గతంలో పార్కులో కాటేజీలు, జెట్టీ నిర్మాణం, రెస్టారెంట్, విశ్రాంతిగది, సమాచార కేంద్రం, టిక్కెట్​ కౌంటర్, పౌంటేన్లు, నిర్మించాలనే ప్రతిపాదనలు చేశారు.

వాటితో ఉపయోగమా? లేదా అనే కోణంలో అధికారులు పరిశీలించారు. గతంలో ఖమ్మం రూరల్​ మండలంలో చింతపల్లికి నైజీరియా కొంగలు వచ్చేవి, వాటిని పాలేరు జలాశయానికి వచ్చే ఏర్పాట్లు చేసేలా  కొత్త ప్రతిపాదనలు చేస్తున్నట్లు ఆఫీసర్లు తెలిపారు. తహాసీల్దారు కరుణశ్రీ పాల్గొన్నారు.