ప్రోస్టార్మ్​​ ఐపీఓకు సెబీ అనుమతి

ప్రోస్టార్మ్​​ ఐపీఓకు సెబీ అనుమతి

హైదరాబాద్​, వెలుగు: పవర్​  సొల్యూషన్ ​ ప్రొడక్టులు తయారు చేసే ప్రోస్టార్మ్ ఐపీఓకు సెబీ నుంచి అనుమతి వచ్చింది. పబ్లిక్​ఇష్యూ ద్వారా ఇది రూ.10 ముఖవిలువ గల 1.6 ఈక్విటీ షేర్లను అమ్ముతుంది.

 అప్పుల చెల్లింపునకు, వర్కింగ్​క్యాపిటల్​ అవసరాలకు, కార్పొరేట్​అవసరాలకు ఈ డబ్బును వాడుతుంది. 2008లో ఏర్పాటైన ప్రోస్టార్మ్ ముంబై కేంద్రంగా పనిచేస్తోంది. దీనికి మహారాష్ట్రలో మూడు ప్లాంట్లు ఉన్నాయి. ఇది యూపీఎస్​ సిస్టమ్స్​, ఇన్వర్టర్స్​, సోలార్​ హైబ్రిడ్​ఇన్వర్టర్లు, లిథియం ఆయాన్​ బ్యాటరీ ప్యాక్​లను తయారు చేస్తుంది.