కూకట్పల్లి, వెలుగు: కూకట్ పల్లి పరిధిలోని పబ్లిక్ప్లేసుల్లో నిల్చుని విటులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తూ, న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్న 10 మంది సెక్స్ వర్కర్లను పోలీసులు అరెస్టు చేశారు. భాగ్యనగర్కాలనీ బస్టాప్, కేపీహెచ్బీ మెట్రో స్టేషన్ వద్ద అడ్డాలు ఏర్పాటు చేసుకుని రాత్రిళ్లు వ్యభిచార దందా చేస్తున్న వీరిని మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. బుధవారం కూకట్పల్లి ఎమ్మార్వో వద్ద బైండోవర్ చేశారు.