- మంత్రి దామోదర రాజనర్సింహ
పుల్కల్, వెలుగు:"భూబకాసురులను నుంచి భూమిని కాపాడుకుంటాం. గుండాగిరి చేస్తే సహించేదిలేదు. కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంటాం" అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సోమవారం చౌటకూర్మండలంలోని సల్తాన్పూర్గ్రామశివారులో ఓ ప్రైవేట్పంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన అలయ్బలాయ్కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కులగణన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని, దీంతో ఇంత వరకు నిర్లక్ష్యానికి గురైన కులాలకు న్యాయం జరుగుతందన్నారు.
ఈ విషయంలో ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గుర్తు చేశారు. దానికనుగుణంగా ప్రభుత్వం వన్మెన్కమిషన్ ఏర్పాటు చేసిందన్నారు. ప్రతీ గ్రామంలో అర్హులకు న్యాయం చేసేందుకు ఇందిరమ్మ కమిటీ వేయనున్నట్లు జీవో జారీ అయిందన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలలో ఇందిరమ్మ కమిటీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. నియోజకవర్గంలో రూ.435 కోట్ల అభివృద్ధి పనులకు వారంలోగా శంకుస్థాపనలు చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో చౌటకూర్, పుల్కల్మండలాల పార్టీ అధ్యక్షులు ధశరత్, దుర్గారెడ్డి, ఉపాధ్యక్షుడు అంజయ్య, మార్కెట్‌కమిటీ చైర్మన్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.