రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేయాలి : తాహెర్​బిన్ హందాన్​

 రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేయాలి :   తాహెర్​బిన్ హందాన్​
  • రాష్ర్ట ఉర్దు అకాడమీ చైర్మన్  తాహెర్​బిన్ హందాన్​

వర్ని, వెలుగు : రాజ్యాంగ పరిరక్షణకు  ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ర్ట ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్​బిన్ హందాన్ సూచించారు. రుద్రూర్​ మండల కేంద్రంలో మంగళవారం కాంగ్రెస్ శ్రేణులు నిర్వహించిన జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్​ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం మహాత్మాగాంధీ, అంబేద్కర్​ ఫొటోలతో ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు.

 అనంతరం తాహెర్​బిన్​మాట్లాడుతూ సన్న బియ్యం పంపిణీలో కేంద్రం వాటా ఉందని గొప్పలు చెప్పుకునే బీజేపీ నాయకులు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో సన్నబియ్యం ఎందుకు పంపిణీ చేయడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్​తోనే సుస్థిర పాలన సాధ్యమన్నారు.  కార్యక్రమంలో బ్లాక్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు ఇందూరు చంద్రశేఖర్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు తోట అరుణ్, బోధన్ మాజీ ఎంపీపీ గంగా శంకర్, మాజీ సింగిల్​విండో చైర్మన్ పత్తి రాము,  రైతు బంధు సమితి మాజీ అధ్యక్షుడు తోట సంగయ్య తదితరులు పాల్గొన్నారు.