అడవుల రక్షణ అందరి బాధ్యత

గూడూరు, వెలుగు : అడవులు అన్యాక్రాంతం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని మహబూబాబాద్ ‌‌‌‌ కలెక్టర్ ‌‌‌‌ శశాంక చెప్పారు. మహబూబాబాద్ ‌‌‌‌ జిల్లా గూడూరు మండలం శీతానగరం శివారు భీమునిపాదం ఫారెస్ట్ ‌‌‌‌ ఏరియాలో ఆఫీసర్లతో మీటింగ్ ‌‌‌‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వన్య ప్రాణుల రక్షణ కోసం అన్ని శాఖల ఆఫీసర్లు కృషి చేయాలని సూచించారు. 

ఫారెస్ట్ ‌‌‌‌ భూములు అన్యాక్రాంతం కాకుండా ఎన్ ‌‌‌‌ఆర్ ‌‌‌‌ఈజీఎస్ ‌‌‌‌ స్కీం కింద కందకాలు తవ్వాలని ఆదేశించారు. ఫారెస్ట్ ‌‌‌‌ ఆఫీసర్లకు డ్యూటీలో ఇబ్బందులు ఎదురైతే పోలీస్ ‌‌‌‌ డిపార్ట్ ‌‌‌‌మెంట్ ‌‌‌‌ను సంప్రదించి సెక్యూరిటీ పొందాలని సూచించారు. ఎవరైనా కొత్తగా పోడు చేసేందుకు ప్రయత్నిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఎస్పీ చంద్రమోహన్ ‌‌‌‌, డీఎఫ్ ‌‌‌‌వో రవికిరణ్, ఎఫ్ ‌‌‌‌డీవో చంద్రశేఖర్, కృష్ణమాచారి, ఎఫ్ ‌‌‌‌ఆర్ ‌‌‌‌వో సురేశ్ ‌‌‌‌, పీడీ సన్యాసయ్య, ఆర్డీవో అలివేలు, ఎంపీడీవో రోజారాణి పాల్గొన్నారు.  

ALSO READ : సిద్దిపేట పోలీసుల పనితీరు బాగుంది : రమేశ్​నాయుడు

గంగారంలో నీతి అయోగ్ ‌‌‌‌ అవగాహన సదస్సు


కొత్తగూడ (గంగారం), వెలుగు : మహబూబాబాద్ ‌‌‌‌ జిల్లా గంగారం మండలం నీతిఅయోగ్ ‌‌‌‌ కింద ఎంపిక కావడంతో గురువారం గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ‌‌‌‌ శశాంక మాట్లాడుతూ నీతి అయోగ్ ‌‌‌‌ కింద రాష్ట్రంలో 10 గ్రామాలు ఎంపికైతే అందులో గంగారం ఒకటన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, న్యూట్రిషిన్, డెవలప్ ‌‌‌‌మెంట్ ‌‌‌‌ వంటి రంగాల్లో మార్పు కోసం కృషి చేయాలని సూచించారు. అనంతరం కొత్తగా కడుతున్న కస్తూరిబా స్కూల్ ‌‌‌‌ను పరిశీలించి, పనులను నెల రోజుల్లో పూర్తి చేసి బిల్డింగ్ ‌‌‌‌ను అప్పగించాలని సూచించారు. జడ్పీ సీఈవో రమాదేవి, పీడీ సన్యాసయ్య, డీపీవో హరిప్రసాద్, డీఎంహెచ్ ‌‌‌‌వో అంబరీశ్ ‌‌‌‌, స్పెషల్ ‌‌‌‌ ఆఫీసర్ ‌‌‌‌ బాలరాజు, ఎంపీడీవో అపర్ణ పాల్గొన్నారు.