భారత రాజ్యాంగ పరిరక్షణ మనందరి బాధ్యత : మామిడాల యశస్విని రెడ్డి

 భారత రాజ్యాంగ పరిరక్షణ మనందరి బాధ్యత : మామిడాల యశస్విని రెడ్డి

తొర్రూరు, వెలుగు: భారత రాజ్యాంగ పరిరక్షణ మనందరి బాధ్యత అని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. ఏఐసీసీ, పీసీసీ ఆదేశాల మేరకు మంగళవారం కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు సుంచు సంతోష్ ఆధ్వర్యంలో తొర్రూరు మండలం కర్కాల నుంచి హరిపిరాల గ్రామ వరకు ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ రాజ్యాంగ పరిరక్షణ సన్నాహ సమావేశం నిర్వహించి, పాదయాత్రను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డితో ఎమ్మెల్యే కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణకు అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ తొర్రూర్ పట్టణాధ్యక్షుడు సోమ రాజశేఖర్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. 

బాధిత కుటుంబాలకు పరామర్శ..

రాయపర్తి: వరంగల్​జిల్లా రాయపర్తి మండలం సూర్యతండా, పన్యానాయక్​ తండాకు చెందిన దేశ్యా నాయక్​, కొక్యానాయక్ మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను కాంగ్రెస్​ పార్టీ నియోజకవర్గ ఇన్​చార్జి హనుమాండ్ల ఝాన్సీరెడ్డి పరామర్శించారు. ఆమెవెంట బ్లాక్​ కాంగ్రెస్​అధ్యక్షుడు జాటోతు ఆమ్యానాయక్, పార్టీ మండలాధ్యక్షుడు ఈదులకంటి రవీందర్​రెడ్డి, వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్​ కమిటీ వైస్​ చైర్మన్​ సరికొండ కృష్ణారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.