ఎమ్మెల్యే గువ్వల దిష్టిబొమ్మ దహనం

వంగూరు, వెలుగు: కాంగ్రెస్  పార్టీ కార్యకర్తలపై దాడికి నిరసనగా సోమవారం మండల కేంద్రంలో అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దిష్టిబొమ్మను ఆ పార్టీ శ్రేణులు దహనం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్  పార్టీ మండల ప్రచార కమిటీ చైర్మన్  పాండురంగారెడ్డి మాట్లాడుతూ గువ్వల బాలరాజు ఓటమి భయంతో కాంగ్రెస్  పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణపై దాడి చేసి, తనపై దాడి జరిగిందని నాటకాలు ఆడుతున్నాడని విమర్శించారు. 

అచ్చంపేటలో ఇప్పటి వరకు ఇలాంటి అరాచకాలు, గుండాయిజాలు జరగలేదన్నారు. గువ్వల ఎమ్మెల్యే అయిన తరువాతే దాడులు, బెదిరింపుల సంస్కృతి ప్రారంభమైందని మండిపడ్డారు. ఇలాంటి ఎమ్మెల్యేకు ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. కార్యక్రమంలో క్యామ మల్లయ్య, రమేశ్​గౌడ్, పరశురాములు, శంకర్ యాదవ్, పిట్టల రమేశ్, మల్లేశ్​యాదవ్, తిరుమలయ్య, నాగయ్య, నాగరాజు, మొగులయ్య, రాజు పాల్గొన్నారు.

ALSO READ : సర్కార్ దగ్గర ఉద్యోగుల జీతాలకే పైసల్లేవ్ : బండి సంజయ్ కుమార్