- ప్రచారంలో సమస్యలపై నిలదీసిన మహిళలు
చెన్నూర్, వెలుగు: చెన్నూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే బాల్క సుమన్ కు నిరసన సెగ తగిలింది. సోమవారం రాత్రి ఆయన చెన్నూర్ మండలంలోని బాబురావుపేటలో ప్రచారానికి వచ్చారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు సమస్యలపై నిలదీశారు.
తమ వార్డుకు వచ్చి రోడ్లు, డ్రైనేజీలు చూడాలని డిమాండ్ చేశారు. దీంతో సుమన్ అనుచరులు వారిపై దురుసుగా ప్రవర్తించారు. అడ్డొచ్చిన వారిపై దాడికి యత్నించారు. స్థానిక మహిళలకు సమాధానం చెప్పలేక సుమన్ అక్కడి నుంచి జారుకున్నారు.