ఎన్ఎస్ యూఐ ఖాతాల స్తంభనపై నిరసన

పాల్వంచ, వెలుగు : పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ అను బంధ ఎన్ఎస్ యూఐకి సంబంధించిన ఖాతాలను మోదీ ప్రభుత్వం స్తంభింపజేయడాన్ని నిరసిస్తూ పాల్వంచలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన తెలిపారు. స్థానిక అంబేద్కర్ సెంటర్​లో ప్లకార్డులు ప్రదర్శిస్తూ బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎడారి ప్రదీప్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం పద్ధతి మార్చుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నియోజకవర్గ, పట్టణ అధ్యక్షులు గడ్డం రాజశేఖర్, హెచ్చు మధు, నాయకులు ప్రసాద్, బట్టు అరుణ్, సుమిత్, మురళి నాయక్, రాంబాబు, నసీం, ప్రవీణ్, పవన్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.