- మాస్టర్ ప్లాన్ పై రాజుకున్న అగ్గి
కామారెడ్డిలో రాజీనామాకు బీజేపీ కౌన్సిలర్లు రెడీ - దుబాయ్ లో వలస కార్మికుల నిరసనల హోరు
కామారెడ్డి, జగిత్యాల పట్టణాల మాస్టర్ ప్లాన్ ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. కామారెడ్డిలో నిన్నటి వరకు కౌన్సిలర్ల ఇండ్లకు వెళ్లి వినతిపత్రాలు సమర్పించిన రైతులు ఇప్పుడు రాజీనామాలు చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. ఇద్దరు బీజేపీ కౌన్సిలర్లు ఇప్పటికే రాజీనామాకు సిద్ధమవటంతో మిగతా వారిపై ఒత్తిడి పెరిగింది. ఈ నెల 20వ తేదీలోపు రిజైన్ చేయకుంటే ఎక్కడికక్కడ అడ్డుకుంటామని, ఇండ్లను ముట్టడిస్తామని మాస్టర్ ప్లాన్ బాధిత రైతుల జేఏసీ హెచ్చరించింది. ఇదిలా ఉండగా జగిత్యాల రూరల్ మండలం లోని నర్సింగాపూర్, తిమ్మాపూర్ గ్రామాల్లోని వ్యవసాయ భూములను మాస్టర్ ప్లాన్ లో భాగంగా ఇండస్ట్రియల్ జోన్ కు మళ్లించడాన్ని నిరసిస్తూ దుబాయ్ లో ఉన్న వలస కార్మికులు ప్రదర్శనలు నిర్వహించారు. గ్రామ ప్రజల కు మద్దతు గా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. వారు తమ భూములు మాస్టర్ ప్లాన్ నుంచి తొలగించలని డిమాండ్ చేశారు. జగిత్యాల అర్బన్ మండలం లోని తిప్పన్న పేట్ గ్రామ ని కి చెందిన 2 వ వార్డు మెంబెర్ బొగు సత్యం తన పదవి కి రాజీనామా చేశారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న తమ గ్రామస్తులకు మద్దతు గా రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు.