మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ.. కాన్వాయ్ ​అడ్డగింత 

 

రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ తగిలింది. ముస్తాబాద్ మండలం ఆవునూరు గ్రామంలో రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. తడిసిన వరి ధాన్యం కొనుగోలు చేయాలని- డిమాండ్​చేశారు. ‘మంత్రి కేటీఆర్.. మీ రాజకీయ పర్యటనలు.. పబ్బం గడుపుకునే రాజకీయాలు బంద్ చేయండి. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఓదార్చే కార్యక్రమాలు పెట్టుకోండి.-- మమ్ములను ఆదుకోకపోతే విషం తాగి చస్తం. ఒక వైపు రైతులు అరిగొస పడుతుంటే మీ రాజకీయ పర్యటనలు అవసరమా?-- మమ్ములను ఓట్లు అడగడానికి ఎలా మా గ్రామానికి వస్తారు’అంటూ కేటీఆర్​ను నిలదీశారు. 

కాన్వాయ్ ​అడ్డగింత 

ఎల్లారెడ్డి పేట మండలం గుంటపల్లి చెరువుతండాలో పంట నష్టం పరిశీలనకు వెళ్తున్న కేటీఆర్​కాన్వాయ్​ని కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్ యూఐ కార్యకర్తలు అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వర్షం వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్​ చేశారు. కాంగ్రెస్​ కార్పొరేటర్ గడుగు రోహిత్ పాటు పలువురు కార్యకర్తలను పోలీసులు స్టేషన్ కు తరలించారు.