ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నిరసన

ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నిరసన

 బోదన్​, వెలుగు: బోధన్​ పట్టణంలోని అంబేద్కర్​ చౌరస్తాలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా బోధన్​ డివిజన్​  మాలమహానాడు నాయకులు ఆదివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాలమహానాడు రాష్ట్ర కార్యదర్శి నీరడి ఈశ్వర్ మాట్లాడుతూ.. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధమని, దీనిపై అప్పీల్ వేస్తామన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాటలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. 

తెలంగాణ వ్యాప్తంగా మాలలు అసెంబ్లీ, ఎంపీ ఎన్నికలలో కాంగ్రెస్​ పార్టీకి మద్దతుగా ఓట్లు వేసి గెలిపిస్తే, సీఎం మాలలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో మాట్లడడం సిగ్గుచేటన్నారు. గ్రామాల్లో  కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను, ఎంపీలను అడ్డుకుంటామని తెలిపారు.  కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీలను రెండు వర్గాలను చేయాలని కుట్రచేస్తున్నారని, మాదిగ సోదరులు తెలుసుకోవాలన్నారు. 

 కార్యక్రమంలో మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు చిట్టెటి మోహన్​రావు, జిల్లా కార్యదర్శి నీరడి రవి, బోధన్​ డివిజన్​ అధ్యక్షులు శ్రావణ్​ కుమార్​, డివిజన్​ కమిటీ ఉపాధ్యక్షుడు కారం స్వామి, జిల్లా ప్రతినిధులు ఆనంపల్లి ఎల్లయ్య, వాగ్మారే సూర్యకాంత్​, పల్నాటి యాదగిరి, డిస్కోసాయాలు, డివిజన్​లోని వివిధ మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.