ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా కరపత్రం ఆవిష్కరించాడన్ని నిరసిస్తూ.. జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఎమ్మార్పీఎస్ నాయకులు మంత్రి కొప్పుల ఈశ్వర్ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. గత ఇరవై తొమ్మిది ఏళ్లుగా జనాభా ప్రాతిపదికన ఎస్సీ వర్గీకరణ చేయాలని ఉద్యమం చేస్తుంటే.. మంత్రి కొప్పుల ఈశ్వర్ స్వయంగా మాల సామాజిక వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాడమని ఢిల్లీకి సాగనంపడం దారుణమన్నారు.
Also Read :- విద్యార్థులకు ఎక్స్ పైరీ అయిన రాగిజావా ప్యాకెట్లు.. పేరెంట్స్ ఆందోళన
అన్ని వర్గాలకు సమన్యాయం చేయకుండా.. కేవలం మాల సామాజిక వర్గానికి కొమ్ము కాస్తున్నారని విమర్శించారు. మాదిగల ఆత్మగౌరవం దెబ్బతీసిన మంత్రి కొప్పుల ఈశ్వర్ కు మమ్మల్ని ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. మాదిగ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పి.. ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు.