
వెర్మాంట్: ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీతో వ్యవహరించిన తీరుపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్కు నిరసన తగిలింది. శనివారం ఆయన తన కుటుంబంతో కలిసి రిపబ్లికన్ పాలిత రాష్ట్రం వెర్మాంట్‌లోని వెయిట్స్ ఫీల్డ్‌కు వెళ్లారు.
స్కై రిసార్టు వద్ద వాన్స్ ఉండగా.. కొన్ని వందల మంది ప్రదర్శనకారులు అక్కడికి చేరుకుని వాన్స్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జెలెన్ స్కీతో అమర్యాదకరంగా వ్యవహరించారని మండిపడ్డారు. అంతర్జాతీయంగా అమెరికాకు తలవంపులు తెచ్చారని విమర్శించారు. ‘వాన్స్ దేశద్రోహి’, ‘మేము (వెర్మాంట్ స్టేట్) ఉక్రెయిన్ వెంటే ఉన్నాం’ అని ప్లకార్డులు చూపారు.