టీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో వినోద్ కు నిరసన సెగ

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూరులో జరిగిన టీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ కు నిరసన సెగ తగిలింది. సభలో వినోద్ కుమార్ మాట్లాడుతుండగానే కొందరు మహిళలు తమ గొడు చెప్పుకున్నారు. అన్ని ఉన్నావారికే పథకాలు ఇస్తున్నారని తమలాంటి పేదలకు కనీసం రేషన్ కార్డులు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంత్యోదయ కార్డుల్ని కూడా ఎత్తివేశారని వినోద్ కుమార్ ను ప్రశ్నించారు. అయితే  వెంటనే కల్గజేసుకున్న వినోద్ కూర్చో..కూర్చో అంటూ మహిళలను మాట్లాడనివ్వలేదు. దేశంలో ఎక్కడా ఇవ్వని రైతు బీమాను కేసీఆర్ ఇస్తున్నారని..రైతుబంధు ఇస్తున్నారని వినోద్ అన్నారు.

 

షర్మిలకు రాజకీయ క్షేత్రం తెలంగాణ కాదని, ఆమె క్షేత్రం ఆంధ్రప్రదేశే అని వినోద్ అన్నారు. షర్మిలను ఇక్కడ తిప్పేది బీజేపీ, కాంగ్రెస్ పార్టీలేనన్న ఆయన... తెలంగాణ ప్రజలని గందరగోళం పరిచేందుకు ఆ రెండు పార్టీలు కుట్ర పన్నాయని ఆరోపించారు. తెలంగాణ  ప్రాజెక్ట్ లకి జాతీయ హోదా కావాలని ఎప్పుడైనా ఆడిగావా షర్మిలా? అని ప్రశ్నించారు. షర్మిల నీవు క్రైస్తవ మతం స్వీకరించావా..?  నీ భర్త అనిల్ క్రైస్తవం గురించి మాట్లాడుతారు కదా అని నిలదీశారు. బైంసాలో ముస్లింలు, హిందువుల పంచాయతీ గత 40 ఏళ్లు గా జరుగుతోందన్నారు.