మంత్రి అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు 

యాదాద్రి భువనగిరి జిల్లా: మంత్రి జగదీష్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నాయకులు నిరసనకు దిగారు. చౌటుప్పల్ మండల కేంద్రంలో మంత్రి జగదీష్ రెడ్డి దిష్టిబొమ్మను బీజేపీ శ్రేణులు దహనం చేశాయి. నిన్న సింగల్ విండో నూతన భవనానికి శంకు స్థాపన చేసే కార్యక్రమంలో గొంగిడి మహేందర్ రెడ్డి ప్రసంగిస్తూ బీజేపీ ని విమర్శించడంతో రాజకీయాలకు ఇది వేదిక కాదన్న సహకార సంఘ డైరెక్టర్ల పై విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. బీజేపీ వారిని గుడ్డలు ఊడతీసి కొడతా అని మంత్రి అనుచిత వాఖ్యలు చేయడం సరికాదని బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా ఆయన దిష్టి బొమ్మను జాతీయ రహదారి పై ఊరేగించి దహనం చేశారు.