జమ్మికుంటలో కాంగ్రెస్ కౌన్సిలర్ల నిరసన

జమ్మికుంట, వెలుగు : జనరల్ బాడీ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తాము రాకముందే పూర్తి చేసి తీర్మానాలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జమ్మికుంటలో 14 మంది కాంగ్రెస్​ కౌన్సిలర్లు నిరసనకు దిగారు. కేవలం 35 నిమిషాల్లోనే మీటింగ్​ పూర్తి చేయడం ఏంటని ప్రశ్నించారు. శుక్రవారం మున్సిపల్​ ఆఫీసులో శుక్రవారం సమావేశం జరిగింది. కాగా మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వస్తున్నామని కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సమాచారమిచ్చినా బీఆర్ఎస్  కౌన్సిలర్ల  ప్రోద్బలంతో తీర్మానాలు చేసి బయటకు వెళ్లారని మండిపడ్డారు.

కాగా ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ ఆయాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ 10 మంది సభ్యుల అనుమతితో తీర్మానాలు చేసినట్లు చెప్పారు. తీర్మానంలో అదనంగా వచ్చిన మూడు బిల్లులను రద్దు చేస్తామన్నారు. దీనిపై కాంగ్రెస్ కౌన్సిలర్లు కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఫిర్యాదు చేస్తామన్నారు.