ఎంపీల సస్పెన్షన్​ రాజ్యాంగ విరుద్ధం

భద్రాద్రికొత్తగూడెం/ఖమ్మం టౌన్/పాల్వంచ, వెలుగు : పార్లమెంట్​లో ఎంపీలను మూకుమ్మడిగా సస్పెండ్​ చేయడం రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్​, సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ, ప్రజాపంథా పార్టీలకు చెందిన లీడర్లు శుక్రవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. ఖమ్మంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు  పువ్వాళ్ల దుర్గా ప్రసాద్, పాల్వంచలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు

 కొత్తగూడెంలో ఆయా పార్టీలకు చెందిన జిల్లా నేతలు ఎస్​కె. సాబీర్​ పాషా, అన్నవరపు కనకయ్య, కెచ్చల రంగయ్య, అంతోటి పాల్, కె. సురేందర్​ మాట్లాడారు. పార్లమెంట్​పై అగంతకులు చేసిన దాడిపై సభలో చర్చించాలని అడిగిన ఇండియా కూటమి పార్లమెంటు సభ్యులను  అప్రజాస్వామికంగా సస్పెన్షన్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు.

పార్లమెంట్​చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్రంలోని బీజేపీ గవర్నమెంట్​ 146 మందికి పైగా ప్రతిపక్ష పార్టీల ఎంపీలను సస్పెండ్​ చేయడం దారుణమన్నారు. ఇండియా కూటమి ఐక్యతను జీర్ణించుకోలేని బీజేపీ సర్కార్​ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.  అన్ని రంగాల్లో వైఫల్యం చెందిన బీజేపీకి ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.