చొప్పదండిలో జూనియర్ పంచాయతీ అధికారుల నిరసన

చొప్పదండి/రామడుగు,వెలుగు: జూనియర్​ పంచాయతీ కార్యదర్శులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే క్రమబద్ధీకరించాలని కాంగ్రెస్​ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి మేడిపల్లి సత్యం డిమాండ్​ చేశారు. రామడుగు మండల కేంద్రంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చేస్తున్న సమ్మెకు మద్దతు ప్రకటించారు. స్థానిక కాంగ్రెస్​ నాయకులతో కలిసి నిరసనలో పాల్గొన్నారు. చొప్పదండి మండలం జూనియర్ పంచాయతీ అధికారులు ఎంపీడీవో ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. వీరి సమ్మెకు చొప్పదండి ఎంపీపీ చిలుక రవీందర్, చాకుంట ఎంపీటీసీ మంగ, సర్పంచులు కుంట రవి, వెల్మ నాగిరెడ్డి  తదితరులు పాల్గొన్నారు.


జగిత్యాల టౌన్, వెలుగు: గ్రామ పంచాయతీలలో పని చేస్తున్న పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేస్తూ వారి న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని తెలంగాణ జన సమితి జగిత్యాల జిల్లా అధ్యక్షుడు చుక్క గంగారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం బుగ్గారం ఎంపీపీ కార్యాలయం ఎదుట కొనసాగుతున్న జేపీఎస్ ల నిరసన దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపారు.  టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షులు ప్రొ. కోదండరాం నేతృత్వంలో జేపీఎస్ లకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.