సహజీవనం చేసి మోసం చేశారని.. ఇంటి ముందు నిరసన

కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం గంగిపల్లి గ్రామంలో సహాజీవనం చేసి మోసం చేశారని ఇంటి ముందు బైఠాయించారు ఇద్దరు యువతులు.    గుడిసెల రమేష్,  వెంకటేష్ అనే అన్నదమ్ములు తమను ప్రేమించి  నాలుగు సంవత్సరాలు సహజీవనం చేసి  మోసం చేశారని ఆరోపిస్తూ అతని ఇంటి ముందు నిరసన తెలిపారు.  

 తమకు న్యాయం చేయాలని బాధిత యువతులిద్దరు డిమాండ్ చేశారు. నిందితుడి తరపు కుటుంబ సభ్యులు నిరసన తెలుపుతున్న  యువతిపై దాడి చేశారు.   తమ ఇంటి దగ్గర నుంచి వెళ్లిపోవాలని గొడవకు దిగారు.