ఎంపీ అర్వింద్​ దిష్టిబొమ్మ దహనం

ఎంపీ అర్వింద్​ దిష్టిబొమ్మ దహనం

ఎడపల్లి, వెలుగు :  బోధన్​ ఎమ్మెల్యే  సుదర్శన్​ రెడ్డి పై   ఎంపీ  అరవింద్​  కామెంట్లకు నిరసనగా  గురువారం ఎడపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్​  మండల శాఖ ఆధ్వర్యంలో అర్వింద్​  దిష్టి బొమ్మను దహనం చేశారు.  పార్టీ మండల అధ్యక్షుడు  పులి శ్రీనివాస్​ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో నిర్వహించి, మాట్లాడారు.   

జవహర్​ నవోదయ పాఠశాల  ఏర్పాటు అంశం పై   అరవింద్​  సుదర్శన్​ రెడ్డి ని తీవ్రంగా విమర్శించాడని , ఎంపీ అరవింద్​ బోధన్​ కు కూడా ఎంపీగా వున్న విషయం మర్చి పోయి మాట్లాడుతున్నాడని అన్నారు.   కార్యక్రమంలో కాంగ్రెస్​   జిల్లా ఎస్సీ సెల్​ అధ్యక్షుడు ఈరంటి లింగం, జైతాపూర్​ సొసైటీ చైర్మన్​ నారాయణ,   నాయకులు ఎల్లయ్య యాదవ్​, సంజీవ్​, స్వామి గౌడ్​, బంజకామప్ప, కిషోర్,​ ఎజాజ్​ తదితరులు పాల్గొన్నారు.