ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐసీలో ఉద్యోగాలు భర్తీ చేయాలి

ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐసీలో ఉద్యోగాలు భర్తీ చేయాలి

కరీంనగర్ సిటీ, వెలుగు : భారతీయ జీవిత బీమా సంస్థ(ఎల్ఐసీ)లో క్లాస్ త్రీ,  క్లాస్ ఫోర్ కేడర్లలో ఉద్యోగ నియామకాలు చేపట్టాలని, అలాగే ఎమర్జెన్సీ టైంలో రద్దు చేసిన యూనియన్ గుర్తింపును పునరుద్ధరించాలని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ డివిజన్ అధ్యక్షుడు రామ్మోహన్ రావు, ప్రధాన కార్యదర్శి వామన్ రావు డిమాండ్ చేశారు. మంగళవారం ఎల్ఐసీ డివిజనల్ ఆఫీసు ఎదుట ధర్నా  నిర్వహించారు. వారు మాట్లాడుతూ 20 ఏండ్లలో వ్యాపారం మూడు రెట్లు పెరిగినప్పటికీ కొత్త రిక్రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ చేపట్టక సిబ్బంది బాగా తగ్గారన్నారు. 

పాలసీదారులకు మరింత మెరుగైన సేవ అందించడం కోసం క్లాస్ త్రీ,  క్లాస్ ఫోర్ కేడర్లలో వెంటనే నియామకాలు చేపట్టాలని కోరారు. అనంతరం డివిజనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేనేజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వినతిపత్రం అందజేశారు. ధర్నాలో ఉద్యోగులు సూర్యకళ, బసవేశ్వర్, అనుపమ, శ్రీలత, మహేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ప్రభాకర్ చారి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.