వైరా, వెలుగు : రాష్ట్రంలోని ఏ మున్సిపాలిటీలో లేనివిధంగా వైరా మున్సిపాలిటీలో ఇంటి పన్నుల భారం ఎక్కువగా ఉందని, వెంటనే తగ్గించాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భూక్యా వీరభద్రం, బొంతు రాంబాబు డిమాండ్ చేశారు.
ఈ విషయమై బుధవారం సీపీఎం వైరా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ ఎదుట ధర్నా చేశారు. కమిషనర్ వేణుకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ వైరా పట్టణ, రూరల్ మండలాల కార్యదర్శులు సుంకర సుధాకర్, తోట నాగేశ్వరావు, పట్టణ నాయకులు పాల్గొన్నారు.