భద్రాచలం, వెలుగు : భద్రాచలంలోని టూరిజం హోటల్లో గత పదేళ్లుగా పనిచేస్తున్న నర్సింహారావు అనే కార్మికుడు బుధవారం గుండెపోటుతో మరణించారు. అకారణంగా హోటల్ మేనేజర్ నర్సింహారావును మూడు నెలల కింద విధుల నుంచి తొలగించారని, దీంతో మనోవేదనకు గురైన అతడు గుండెపోటుతో చనిపోయారని ఆరోపిస్తూ దళిత సంఘాలు ఆందోళన చేపట్టాయి. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు.